Ex MLA Rohith Reddy | తాండూరు, ఏప్రిల్ 13: ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఊరువాడ ఒక్కటై కదిలి భారీగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ తాండూరులోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
పార్టీ సీనియర్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
భూగర్భజలాలు అడుగంటి చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి చేష్టలు చూశాక ప్రజలందరూ మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు మారకుండా కష్టకాలంలో ప్రజలకు తోడుంటూ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేసేవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ను నమ్ముకున్నవారికి ఎప్పుడు మంచే జరుగుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఊరూరా బీఆర్ఎస్ జెండాలు ఎగరడం ఖాయమన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగను జరుపుకుంటున్నామని.. ఇంటి పండుగలా ఈ వేడుకలకు తాండూరు నియోజకవర్గం ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. అందుకోసం ప్రత్యేక వాహనాలను పెట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, తాండూరు మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, నాయకులు రమేశ్, శకుంతల, ఉమాశంకర్ తదితరులున్నారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్‌కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్