ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ వృద్ధిమాన్ సాహా. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ ఇటీవల బాంబు పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఒక జర్నలిస్టు తనను ఎలా బెదిరించిందీ బయటపెట్టి మరో దుమారం రేపాడు. సదరు జర్నలిస్టుతో తన వాట్సాప్ సంభాషణన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పెట్టాడు సాహా. దీంతో మాజీ క్రికెటర్లతోపాటు క్రికెట్ అభిమానులు కూడా జర్నలిస్టు ప్రవర్తనను తప్పుపట్టారు.
అదే సమయంలో ఆ జర్నలిస్టు ఎవరో బయటపెట్టాలని సాహాను అడిగారు. దీనిపై తాజాగా స్పందించిన సాహా వరుస ట్వీట్లు చేశాడు. ‘‘నేను చాలా బాధపడ్డా. ఇలాంటి ప్రవర్తనను ఎవరూ భరించకూడదని అనుకున్నా. ఇలా మరొకరు బెదిరింపులకు గురికాకూడదని భావించా. అందుకే ఈ చాట్‌ను అందరి ముందు పెట్టా. కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు’’ అని మొదటి ట్వీట్లో సాహా వివరించాడు.
‘‘ఎవరి కెరీర్ నాశనం చేసే మనస్తత్వం నాకు లేదు. అందుకే మానవత్వ కోణంలో ఆ వ్యక్తి, వారి కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ జర్నలిస్టు పేరు చెప్పలేదు. కానీ ఇలా మరోసారి జరిగితే ఏమాత్రం తగ్గను’’ అని తేల్చిచెప్పాడు. అలాగే ఈ వివాదంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అయితే ఈ ట్వీట్‌పై కూడా సెహ్వాగ్ వంటి వారు స్పందించారు. ‘‘ఏం పర్లేదు.. ఆ పేరు చెప్పేయ్’’ అంటూ ట్వీట్లు చేశారు. ఈ విషయంపై తాము కూడా దర్యాప్తు చేస్తామని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
1/3- I was hurt and offended. I thought not to tolerate such kind of behaviour and didn’t want anyone to go through these kind of bullying. I decided I will go out and expose the chat in public eye, but not his/her name
— Wriddhiman Saha (@Wriddhipops) February 22, 2022
3/3- I thank each and everyone who has shown support and extended their willingness to help. My gratitude.
— Wriddhiman Saha (@Wriddhipops) February 22, 2022