WPL 2023 : మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదలైంది. ఆరంభ పోరులో బేత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బేత్ మూనీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో, ముంబై జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తుది జట్టులో ఆడుతున్నది వీళ్లే..
గుజరాత్ జెయింట్స్ జట్టు: బేత్ మూనీ (కెప్టెన్), సబ్బినేని మేఘనా, హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, డి.హేమలత, కిమ్ గ్రాత్, అన్నబెల్ సథర్లాండ్, స్నేహ్ రానా, మన్సీ జోషి, మోనికా పటేల్,తనుజా కన్వర్.
ముంబై ఇండియన్స్ జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మ్యాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, ధారా గుజ్జర్, అమేలియా కేర్, పూజా వస్త్రాకర్, అమన్‌జోత్ కౌర్, జింతిమణి కలిత, ఇసీ వాంగ్, సోనమ్ యాదవ్, సైకా ఇషక్.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. కామెంటేటర్ మందీరా బేడీ డబ్ల్యూపీఎల్ ప్రాధాన్యాన్ని, ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఐదు ఫ్రాంఛైజీల గురించి వివరించింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కియరా అడ్వానీ, కృతిసనన్ చక్ దే ఇండియా, కోకకోలా, థుంకేశ్వరరీ వంటి పాటలకు డాన్స్‌తో ఆకట్టుకున్నారు. పంజాబ్, కెనడా ర్యాపర్ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
అనంతరం ఐదు జట్ల కెప్టెన్లను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, సెక్రెటరీ జై షా, సభ్యులు రాజీవ్ శుక్లా, తదితరులు పరిచయం చేసుకున్నారు. స్మృతి మంధాన (ఆర్సీబీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్), బేత్ మూనీ (గుజరాత్ జెయింట్స్), అలీసా హేలీ (యూపీ వారియర్స్), మేగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు.
🚨 Toss Update 🚨@GujaratGiants have won the toss and they have elected to bowl first against @mipaltan in Match 1⃣ of the #TATAWPL! pic.twitter.com/HCuPYBEfft
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023
The moment we were all waiting for! 🤩
𝗣𝗿𝗲𝘀𝗲𝗻𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 #𝗧𝗔𝗧𝗔𝗪𝗣𝗟 𝗧𝗿𝗼𝗽𝗵𝘆👌👌 pic.twitter.com/sqPBJjWw7A
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023