WPL Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో మిచెల్ స్టార్క్ భార్య అలిసా హేలీని యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. రూ. 70 లక్షలకు ఈ వికెట్ కీపర్‌ను దక్కించుకుంది. అలిసా కోసం ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ పోటీ పడ్డాయి. ఐదు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో అలిసా సభ్యురాలు. ఈమె భర్త ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో ఆడాడు. 2014, 2015 సీజన్లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు.
గాయం కారణంగా మిచెల్ స్టార్క్ బోర్డర్ – గవాస్కర్ సిరీస్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అతను గాయపడ్డాడు. అతను రెండో టెస్టు ఆడేది? లేనిది? తెలియాల్సి ఉంది. మరో బౌలర్ హేజిల్‌వుడ్ కూడా గాయంతో రెండు టెస్టులకు అందుబాటులో లేడు. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 12 రన్స్‌తో గెలిచింది. రెండో టెస్టు ఫిబ్రవరి 15న ఢిల్లీలో జరగనుంది.