WPL 2026 : మహిళా క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్ రాబోతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. జనవరి మొదటి వారంలో డబ్ల్యూపీఎల్ సందడి మొదలవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. జనవరి 6 మంగళవారం లేదంటే 8వ తేదీ గురువారంజ.. ఈ రెండింటిలో ఒక తేదీన నాలుగో సీజన్ షురూ కానుందని సమాచారం. అయితే.. గత మూడు పర్యాయాలు ఫిబ్రవరి – మార్చి మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఆనవాయితీకి మంగళం పాడడానికి ఓ కారణముంది. అదేంటంటే..
గత మూడు సీజన్లుగా మహిళల ప్రీమియర్ లీగ్ అభిమానులను అలరిస్తూ వస్తోంది. దాంతో, నాలుగో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. వచ్చే ఏడాది వేసవిలో టీ20 ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తోంది. సో.. ప్రపంచ కప్ మ్యాచ్‌లతో క్లాష్ లేకుండా చూడాలని డబ్ల్యూపీఎల్ షెడ్యూల్‌ను ముందుకు జరిపారు నిర్వాహకులు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచ కప్ మార్చిలో మొదలవ్వనుంది.
Breaking News 🗞️ 🚨
WPL is expected to commence in January this season. It can even start as early as 6th January due to the scheduled WT20 in Feb-March
(Mumbai Mirror) pic.twitter.com/KXgaTRgpFF
— RCBXTRA (@RCBXTRAOFFICIAL) September 16, 2025
డబ్ల్యూపీఎల్ ఆరంభం సీజన్ నుంచి ఐదు జట్లు మాత్రమే పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్.. ఈ ఫ్రాంచైజీలే ఈసారి కూడా టైటిల్ కోసం పోటీపడనున్నాయి. మరో విషయం ఏంటంటే.. నాలుగో సీజన్ ఆరంభానికి ముందు నవంబర్‌లో వేలం పూర్తి చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు నిర్వాహకులు.
The Smriti Mandhana-led Royal Challengers Bangalore reign supreme! 🏆
Presenting before you – Champions of the #TATAWPL 2024 ! 🙌 🙌
Congratulations, #RCB! 👏 👏#DCvRCB | #Final | @RCBTweets | @mandhana_smriti pic.twitter.com/mYbX9qWrUt
— Women’s Premier League (WPL) (@wplt20) March 17, 2024
గత సీజన్ విజేత ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నమెంట్ బరిలోకి దిగనుంది. తొలి రెండు సీజన్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారత్యంలోని ముంబై ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో.. నాలుగో సీజన్లో కొత్త విజేతగా కప్‌ను ముద్దాడేందుకు ఢిల్లీ, యూపీ, గుజరాత్ జట్లు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి.