WPL 2024, MI vs DC | బెంగళూరు వేదికగా మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో భాగంగా తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ అలీస్ క్యాప్సీ.. (53 బంతుల్లో 75, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. క్యాప్సీతో పాటు కెప్టెన్ మెగ్ లానింగ్ (25 బంతుల్లో 31, 3 ఫోర్లు, 1 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 42, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 చేసింది. ముంబై బౌలర్లలో నటాలీ సీవర్ బ్రంట్, అమెలియా కెర్లు తలా రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి మూడో ఓవర్లోనే తొలి షాక్ తాకింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (1) ను షబ్నిమ్ ఇస్మాయిల్ మూడో ఓవర్లో తొలి బంతికి బౌల్డ్ చేసింది. మూడు ఓవర్లలో ఆ జట్టు ఆరు పరుగులే చేసింది. షఫాలీ నిష్క్రమించాక వన్ డౌన్లో వచ్చిన క్యాప్సీ వచ్చీ రావడంతోనే బౌండరీల బాట పట్టింది. నటాలీ సీవర్ బ్రంట్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టింది. అమెలియా కెర్ వేసిన ఏడో ఓవర్లో క్యాప్సీ, లానింగ్‌లు తలా ఓ బౌండరీ బాదారు. సత్యమూర్తి కీర్తన వేసిన 8వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టిన లానింగ్.. కెర్ వేసిన మరుసటి ఓవర్లో సిక్సర్ బాదింది. కానీ సీవర్ వేసిన 11 వ ఓవర్లో నాలుగో బాల్‌కు సంజనాకు క్యాచ్ ఇచ్చింది.
Innings Break!
The @DelhiCapitals post a challenging 🎯 of 172 for @mipaltan
Alice Capsey top-scores with 75(53) 🙌
Are we in for a high scoring thriller in the #TATAWPL Season opener? 🔥
Scorecard 💻📱 https://t.co/GYk8lnVpA8#MIvDC pic.twitter.com/dJiEgyykrD
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024
లానింగ్ నిష్క్రమించిన మరుసటి ఓవర్లో క్యాప్సీ.. రెండు సిక్సర్లు, ఫోర్‌తో స్కోరు వేగాన్ని పెంచింది. తద్వారా ఆమె 34 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసింది. ఆ తర్వాత రెండు ఓవర్లలో జెమీమా, క్యాప్సీలు వేగంగా ఆడటంతో ఢిల్లీ స్కోరు రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. 40 బంతుల్లోనే 74 పరగులు చేసిన ఈ జోడీని ఎట్టకేలకు కెర్ విడదీసింది. ఆ మరుసటి ఓవర్లోనే రోడ్రిగ్స్ కూడా ఔట్ అయింది. ఆఖరి ఓవర్లో మరిజన్నె కాప్ (9 బంతుల్లో 16, 3 ఫోర్లు) మూడు ఫోర్లు బాదడంతో ఆ జట్టు 170 పరుగుల మైలురాయిని దాటింది. ఈ మ్యాచ్‌లో ముంబై నెగ్గాలంటే 120 బంతుల్లో 172 పరుగులు చేయాల్సి ఉంది.