WPL-2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో బీసీసీఐ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించగా.. విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో సీజన్ (WPL-2024) రెండో సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా రెండోసీజన్కు సంబంధించి రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను గురువారం విడుదల చేసింది. ఐదు ఫ్రాంచైజీలు కలిపి 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. 29 మంది ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాయి. అత్యధిక మందిని విడుదల చేసిన జట్టుగా గుజరాత్ జెయింట్స్ నిలిచింది.
ఒకే జట్టు 11 మందిని వదులుకున్నది. త్వరలో నిర్వహించనున్న వేలంలో కొత్తవారిని కొనుగోలు చేయనున్నది. తొలి ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ నలుగురిని తొలగించగా.. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురి ఆటగాళ్లను విడుదల చేసింది. తొలగించిన 60 మంది ఆటగాళ్లలో 21 మంది విదేశీ ప్లేయర్లు ఉండగా.. 39 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. ఆర్సీబీ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్‌ను తొలగించింది. సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, సుష్మా వర్మతో మరికొందరిని గుజరాత్ రిలీవ్ చేసింది. కీలక ప్లేయర్లు అయిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లను ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ రిటైన్ చేసుకున్నారు.
ఎలిస్ క్యాప్సే, అరుంధతీ రెడ్డి, జెమిమా రోడ్రిగ్జ్, జెస్ జోనాస్సెన్, అల్ హారిస్, మారిజన్ కాప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తాన్యా భాటియా, టిటాస్ సాధును ఢిల్లీ జట్టు రిటైన్ చేసుకున్నది. అపర్ణ మండల్, జసియా అక్తర్, తారా నోరిస్‌ను తప్పించింది.
ఆష్లే గార్డనర్, బెత్ మూనీ, డేలాన్ హేమ్లత, హర్లీన్ డియోల్, లారా వోల్‌వర్త్, షబ్నమ్ షకీల్, స్నేహ రాణా, తనూజా కన్వర్‌ను గుజరాత్ రిటైన్ చేసుకున్నది. అన్నాబెల్ సదర్లాండ్, అశ్వనీ కుమారి, జార్జియా వేర్హామ్, హర్లీ గాలా, కిమ్ గార్త్, మాన్సీ జోషి, మోనికా పటేల్, పరునికా సిసోడియా, సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, సుష్మా వర్మను వదులుకున్నది.
అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, ఇసాబెల్ వాంగ్, జింటిమణి కలితా, నటాలీ స్కీవర్, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యస్తికా భాటియా రిటైన్ చేసుకుంది. ధారా గుజ్జర్, హీథర్ గ్రాహం, నీలం బిష్త్, సోనమ్ యాదవ్‌ను రిలీవ్ చేసింది.
ఆశా శోభన, దిశా కస్సట్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, ఇంద్రాణి రాయ్, కనికా అహుజా, రేణుకా సింగ్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన, సోఫీ డివైన్ అట్టిపెట్టుకోగా.. డేన్ వాన్ నీకెర్క్, ఎరిన్ బర్న్స్, కోమల్ జంజాద్, మేగాన్ షట్, పూనమ్ ఖేమ్నార్, ప్రీతి బోస్, సహానా పవార్ వదులుకున్నది.
అలిస్సా హీలీ, అంజలి సర్వాని, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్శ్వి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్, ఎస్ యశశ్రీ, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్‌ను రిటైన్ చేసుకోగా.. దేవికా వైద్య, షబ్నం ఇస్మాయిల్, శివలీ షిండే, సిమ్రాన్ షేక్‌ను రిలీవ్ చేసింది.