WPL 2023 : భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో సబ్బినేని మేఘన (2) బౌల్డ్ అయింది. 5 పరుగులకే గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. వాంగ్ వేసిన మూడో ఓవర్లో అషే గార్డ్నర్ (0) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న హేలీ మ్యాథ్యూస్ సూపర్ క్యాచ్ అందుకుంది. తొలి ఓవర్లోనే డియోల్ హర్లిన్ ఔట్ అయింది. నాట్ సీవర్ బ్రంట్ వేసిన ఆఖరి బంతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఓపెనర్‌గా వచ్చిన బేత్ మూనీ మొదటి ఓవర్లోనే కెప్టెన్ మూనీ రిటౌర్డ్ హర్ట్‌గా మైదానం వీడింది. అన్నాబెల్ సౌథర్లాండ్ (6), దయలాన్ హేమలత క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు గుజరాత్ జెయింట్స్ స్కోర్.. 11/3.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ (65)తో చెలరేగింది. చివర్లో అమేలియా కేర్ (45), పూజా వస్త్రాకర్ ధాటిగా ఆడారు. అమేలియాతో కలిసి హర్మన్‌ప్రీత్ నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ముంబైని నాట్ హేలీ మ్యాథ్యూస్ (47) , నాట్ సీవర్ బ్రంట్ (23) ఆదుకున్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 54 రన్స్ చేశారు.