సెమీస్‌లో భారత్.. ఐర్లాండ్‌పై టీమ్ఇండియా విజయం
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఐదు పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) విజయం సాధించింది.
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.ఐర్లాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ఇండియా అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయ్యింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన ధనాధన్ అర్ధసెంచరీతో భారీ స్కోరు అందుకున్న టీమ్ ఇండియా.. ఐర్లాండ్‌ను కట్టడి చేసింది. ఎడతెరిపిలేని వర్షంతో మైదానం చిత్తడిగా మారడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కౌర్‌సేన ముందంజ వేసింది. మెగాటోర్నీలో వరుసగా మూడోసారి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.
గెబెర్హ(దక్షిణాఫ్రికా): ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఐదు పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఐర్లాండ్ 54 పరుగులు చేసింది. దీంతో డీఎల్ఎస్ ప్రకారం 5 పరుగు ల ఆధిక్యంతో భారత్ గెలిచింది. తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మందన(56 బంతుల్లో 87, 9ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 155/6 స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 8.2 ఓవర్లలో 54/2 స్కోరు చేసింది. మందనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
మందన మెరుపులు:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మందన, షెఫాలీ వర్మ(24) ఐర్లాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ఐరీష్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ మందన ఆది నుంచే బౌండరీలతో విరుచుకుపడింది. ఇన్నింగ్స్ కుదురుగా సాగుతున్న క్రమంలో డెల్నె బౌలింగ్‌లో షెఫాలీ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(8)తో కలిసి మందన ఎదురుదాడికి దిగింది. అయితే పరుగు తేడాతో కౌర్, రిచా ఘోష్(0) ఔటైనా మందన జోరు తగ్గించలేదు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిన మందన ప్రెండెన్గ్రాస్ట్ బౌలింగ్‌లో నిష్క్రమించింది.
ఐర్లాండ్ పడుతూ లేస్తూ:
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ అమీ హంటర్(1) రనౌట్‌గా వెనుదిరిగింది. లెవిస్, లారా డెన్లీ(17 నాటౌట్) రాణించారు. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 155/6 (మందన 87, షెఫాలీ వర్మ 27, డెన్లీ 3/33, ప్రెండన్గ్రాస్ట్ 2/22), ఐర్లాండ్: 8.2 ఓవర్లలో 54/2(లెవిస్ 32 నాటౌట్,డెన్లీ 17 నాటౌట్, రేణుకాసింగ్ 1/10)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

