రాజ్‌గిర్(బీహార్): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 4-0తో మలేషియాను ఓడించింది. యువ స్ట్రైకర్ సంగీతా కుమారి రెండు గోల్స్ (8వ, 55వ నిమిషాల్లో) చేయగా ప్రీతి దూబే (43వ ని.), ఉదిత (44వ ని.) తలా ఓ గోల్ చేశారు.
మ్యాచ్‌లో తొలి క్వార్టర్స్ నుంచే భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మలేషియా డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ భారత్ గోల్స్ సాధించింది. తొలి పోరులో జయకేతనం ఎగురవేసిన భారత్.. మంగళవారం సౌత్కొరియాను ఢీకొననుంది. ఈ టోర్నీలో జపాన్, కొరియా మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగియగా చైనా..15-0తో థాయ్‌లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది.