ACT | రాజ్‌గిర్ (బీహార్): మహిళల ఆసియా కప్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం మన అమ్మాయిలు 13-0తో థాయ్‌లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశారు. భారత్ తరఫున యువ స్ట్రైకర్ దీపికా ఏకంగా 5 గోల్స్ (3, 19, 43, 45, 45వ నిమిషాలు)తో సత్తా చాటగా ప్రీతి దూబె (9, 40వ ని.), లల్రెమ్సియామి (12, 56వ ని.), మనీషా చౌహాన్ (55, 58వ ని.) చెరో రెండు గోల్స్ చేశారు.
బ్యూటీ డంగ్‌డంగ్ (30వ ని.), నవ్‌నీత్ కౌర్ (53వ ని.) తలా ఓ గోల్ చేశారు. ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్.. శనివారం చైనాతో తలపడనుంది.