Virat Kohli | భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాట్‌పట్టి బరిలోకి దిగితే ప్రత్యర్థి జట్టు వణికిపోవాల్సిందే. అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాకు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించిన కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పెద్ద సంఖ్యలో మహిళా అభిమానులు సైతం ఉన్నారు. విరాట్ ఎక్కడికి వెళ్లినా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడతారు. ఈ క్రమంలో తాజాగా ఓ యువతి కోహ్లీ మైనపు బొమ్మకు లిప్ కిస్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మేడమ్ టుస్సాడ్స్‌లోని విరాట్ కోహ్లీ మైనపు బొమ్మకు లిప్‌కిస్ ఇచ్చింది.
తనకు కోహ్లీనే కిస్ ఇస్తున్నట్లుగా ఓ పోస్ ఇవ్వగా.. ఆ యువతి స్నేహితురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఫొటోస్, వీడియో చూసిన పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘భలే ఛాన్స్ కొట్టేసింది’ అని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. ‘పాపం అనుష్క శర్మ’ మరో యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ ఏం జరుగుతోంది? అని, ఇంకొకరు మైనపు బొమ్మను పాడు చేసిందని, ఎవరో ఆమె అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టారు. అయితే, సదరు యువతి కోహ్లీ వీరాభిమాని అని తెలుస్తుండగా.. వివరాలు తెలియరాలేదు.
With a statue… pic.twitter.com/TXU67kSlYz
— Gems of Simps (@GemsOfSimps) February 20, 2023