వింబుల్డన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్‌లో సెర్బియా టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జెకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో విజయం సాధించి వింబుల్డన్ టైటిల్ అందుకున్నారు.
ఫైనల్లో ఇటలీ ప్లేయర్ బెర్టినిపై జెకోవిచ్ విజయం సాధించారు. బెర్టినిపై 6-7, 6-4, 6-4, 6-3 (1-3) పాయింట్ల తేడాతో ఆయన ఈ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఇక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకోవడంలో జెకోవిచ్ రికార్డులు నెలకొల్పారు.
వింబుల్డన్ టైటిల్‌ను జెకోవిచ్ గెలుచుకోవడం ఇది ఆరోసారి. వరుసగా 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారుడిగా జెకోవిచ్ నిలిచారు. ఇక ఫెదరర్, నాదల్ రికార్డులను సమం చేశారు.
టెన్నిస్ చరిత్రలో అత్యధిక రికార్డులు నెలకొల్పిన క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచారు. ఇక తొలి టైటిల్ గెలుచుకుందామన్న బెర్టిని ఆశలు నెరవేరలేదు.