Asia Cup | టీమిండియా వచ్చే నెలలో ఆసియా కప్‌లో ఆడనున్నది. ఈ టోర్నీలో జట్టు కూర్పుపై చర్చలు సాగుతున్నాయి. యువ టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు టీ20 జట్టులో చోటు కల్పిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగనున్నది. టీమిండియా శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్‌లో అద్భుతంగా రాణించింది. జైస్వాల్ సైతం తనదైన ముద్రవేశారు. అయితే, టెస్ట్ సిరీస్‌లో రాణించిన ఇద్దరికి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. ఈ టోర్నీ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయి.
నివేదికల ప్రకారం.. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో గతంలో పలుసార్లు రాణించిన ఆటగాళ్లపైనే ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంభీర్ హెచ్కోచ్గా బాధ్యతలు స్వీకరించాక భారత జట్టు 15 టీ20 మ్యాచుల్లో 13 గెలిచింది. ఈ సారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరిగే విషయం తెలిసిందే. భారత కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. 25 ఏళ్ల యువ టీ20 కెప్టెన్ జట్టును అద్భుతంగా నడిపించడంతో పాటు బ్యాట్‌తోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదుమ్యాచుల సిరీస్‌ను భారత్ 2-2 తేడాతో డ్రా చేరసుకుంది. ఈ పర్యటనలో గిల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 754 పరుగులు చేశాడు. 75.40 సగటుతో పరుగులు చేయగా.. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
బెస్ట్ సోర్క్ 269 పరుగులు, అద్భుతమైన బ్యాటింగ్‌తో జులై నెలలో ఐసీసీ బెస్ట్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ ఏడాది గిల్ మొత్తం సగటు 64.94తో 20 ఇన్సింగ్స్‌లో 1234 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఈ సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు బెన్ డకెట్ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచ్‌ల్లో 47.77 సగటుతో 1290 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 165 పరుగులు. సమాచారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) యొక్క స్లో పిచ్‌లపై బాగా ఆడగల అనుభవజ్ఞుడైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కోసం జట్టు మేనేజ్మెంట్ వెతుకున్నది. శ్రేయాస్ అయ్యర్, జితేశ్ శర్మలో ఎవరో ఒకరు టీ20 జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.