Wibledon Winners : వింబుల్డన్‌లో తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసి తొలిసారి విజేతగా అవతరించారు జన్నిక్ సిన్నర్, ఇగా స్వియాటెక్. తమ దేశానికి ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీని అందించి సరికొత్త చరిత్ర సృష్టించారు. తమ అద్భుతమైన ఆటతో టైటిల్ కొల్లగొట్టిన ఈ ఇద్దరు జూలై 14 న ఛాంపియన్స్ డిన్నర్(Chapions Dinner)లో సందడి చేశారు. గ్రాండ్‌స్లామ్ ముగిసిన తర్వాతి ఆదివారం నిర్వహించే ఈ డిన్నర్లో పాల్గొన్న ఇరువురు.. తమ స్టయిల్ డ్రెస్సింగ్, డ్యాన్స్ స్టెప్పులతో అందర్నీ ఫిదా చేశారు.
వింబుల్డన్ సింగిల్స్ విజేతల గౌరవార్థం ఛాంపియన్స్ డిన్నర్ నిర్వహిస్తారు. ఈ ఆనవాయితీని 1977లో ప్రారంభించారు. అప్పట్నుంచీ ఈ డిన్నర్‌కు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. తొలిసారి వింబుల్డన్ ట్రోఫీతో ఛాంపియన్స్ డిన్నర్‌కు హాజరయ్యారు సిన్నర్, స్వియాటెక్. ఇటలీ స్టార్ అయిన సిన్నర్ బ్లాక్ సూట్, టై, బ్లాక్ షూ ధరించగా.. పొలాండ్ బ్యూటీ పొడవాటి ఊదారంగు గౌనులో ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. వీళ్లిద్దరి డాన్స్ వీడియోను వింబుల్డన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Sinner et Swiatek ont fait la danse traditionnelle de Wimbledon
Jannik s’est éclaté on dirait
Il avait déclaré
🇮🇹« C’est un problème. Je ne suis pas très doué en danse. Mais allez… je peux m’en sortir. »pic.twitter.com/x600SYLKRe
— TennisTemple (@tennistemple) July 14, 2025
పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్కు చెక్ పెట్టాడు సిన్నర్. హ్యాట్రిక్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాలనుకున్న అడి కలను కల్లలు చేస్తూ ఇటలీ తరఫున మొదటి వింబుల్డన్ టైటిల్ గెలుపొందాడీ నంబర్ 1 ప్లేయర్. డోప్ టెస్టు, తాతయ్య మరణం.. ర్యాంకింగ్స్‌లో వెనకబాటు వంటివి బాధించినా సంకల్పంతో వింబుల్డన్ ఫైనల్ చేరింది స్వియాటెక్. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో అమెరికాకు చెందిన అమందను చిత్తుగా ఓడించిందీ టాప్ సీడ్. రెండుసెట్లలో 6-0, 6-0తో ప్రత్యర్థిని మట్టికరిపించి ఛాంపియన్‌గా అవతరిచిందామె. సిన్నర్, స్వియాటెక్లకు ఇదే మొట్టమొదటి వింబుల్డన్ ట్రోఫీ కావడం విశేషం.