Siddharth – Kiara : బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) – కియారా అడ్వాణీ( Kiara Advani)లు మొదటిసారి తల్లిదండ్రులయ్యారు. గర్భవతిగా ఉన్న కియారా మంగళవారం (జూలై 15న) పండంటి ఆడబిడ్డ (Baby Girl)కు జన్మనిచ్చింది. ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కియారాకు కాన్పు నిర్వహించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దాంతో, పలువురు ‘కంగ్రాట్స్ .. న్యూ పేరంట్స్’ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. బాలీవుడ్ తారలు, క్రికెటర్లు సిద్ధార్థ్ – కియారాకు అభినందనలు తెలియజేస్తున్నారు.
వెండితెరపై ప్రేమజంటగా మెప్పించిన సిద్ధార్థ్ – కియారాలు నిజజీవితంలోనూ లవ్ బర్డ్స్ అయిపోయారు. ఆ తర్వాత ఇరుకుటుంబాల ఆమోదంతో రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము త్వరలోనే ముగ్గురం కాబోతున్నామనే వార్తను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది ఈ జంట . ఇరువురు చేతుల్లో చిన్న సాక్సులను పట్టుకొని ఉన్న ఫొటోను పంచుకున్నారు. దానికి ‘మా జీవితంలో గొప్ప బహుమతి త్వరలోనే రాబోతోంది’ అని క్యాప్షన్ పెట్టారు.
Ladies & Gentleman, Baby Malhotra is here 👧#SidharthMalhotra #KiaraAdvani #War2 #ParamSundari pic.twitter.com/ArKvoA6H9r
— Bollywood Talkies (@bolly_talkies) July 15, 2025
అయితే.. ఆగస్టులో కియారాకు డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్లు. కానీ, అంతకంటే ముందే ఆమె తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు కోసం కియారాను ముంబైలోని గిర్గాన్ ప్రాంతంలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మంగళవారం నటికి డెలివరీ చేశారు. తమ కుటుంబంలో సంతోషాల పండుగను తీసకొచ్చిన పాపాయిని చూసకొని తెగ మురిసిపోతోంది ఈ సినీ జంట.
#SidharthMalhotra and #KiaraAdvani have been blessed with a baby girl!💗 Congratulations are in order!🥺#Femina #SidKiara #fyp pic.twitter.com/HJRmz8aIcS
— Femina (@FeminaIndia) July 15, 2025