Vijay Sethupathi | జాతీయ అవార్డు గ్రహీత, భావోద్వేగాలను అద్భుతంగా పండించే దర్శకుడు పాండిరాజ్. విలక్షణ నటనకు పెట్టింది పేరు విజయ్ సేతుపతి. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తున్నది. అదే ‘తలైవన్ తలైవి’ (Sir Madam). ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానున్నది. ఈ మూవీలో విజయ్ సేతుపతికి నిత్యా మీనన్ జోడీగా నటించనున్నది. ఒకానొక సమయంలో పాండిరాజ్ – విజయ్ సేతుపతి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రస్థాయికి చేరి, మళ్లీ కలసి పనిచేయకూడదన్నంత వరకూ వెళ్లినట్టు పాండిరాజ్ తాజాగా ఒక ప్రెస్మీట్లో వెల్లడించారు. ‘అయితే, జీవితంలో కొన్ని అనుకోని మలుపులు జరుగుతాయి. దర్శకుడు మిష్కిన్ పుట్టినరోజు వేడుకలో ఇద్దరం మళ్లీ తిరిగి కలుసుకున్నాం. అదే సందర్భంలో సేతుపతి ‘మనం మళ్లీ కలిసి ఒక సినిమా చేద్దాం’ అని ప్రతిపాదించారు. ఆ మాటలను నా గుండెను తాకాయి. పాత విభేదాలు పక్కన పెట్టి కొత్తగా కొత్త ప్రయాణం ప్రారంభించాం’ అంటూ పాండిరాజ్ చెప్పుకొచ్చారు.
మిష్కిన్ పార్టీ తర్వాత ‘తలైవన్ తలైవి’ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేశాయనని పాండిరాజ్ పేర్కొన్నారు. విజయ్ సేతుపతియే ఈ మూవీకి తనకు హీరోనేనని బలంగా విశ్వసించానని తెలిపారు. కథ పూర్తయ్యాక వెళ్లి విజయ్ సేతుపతికి 20 నిమిషాల పాటు కథను వివరించానని.. స్టోరీ అంతా విన్న వెంటనే మూవీ చేసేందుకు అంగీకరించారని పాండిరాజ్ తెలిపారు. ఈ మూవీలో ఇందులో ఆయన నటన మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ వ్యవహరించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా అందరినీ అలరిస్తుందని మూవీ టీమ్ పేర్కొంది. ఈ నెల 25న విడుదలకానున్న నేపథ్యంలో విజయ్ సేతుపతి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాండిరాజ్ – విజయ్ సేతుపతి కలిసి చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.