టీ20 క్రికెట్ అంటేనే భారీ సిక్సర్లు, ఫోర్లు. అవే ఆటగాళ్లతోపాటు ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహాన్ని పెంచుతాయి. అదే చివరి ఓవర్లో సిక్సర్లు పడితే.. ఆ మజానే వేరు. తాజాగా టీ20 ప్రపంచకప్ మొదటి గ్రూప్‌లో భాగంగా జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది.
ఆ సమయంలో చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న రావ్‌మెన్ పావెల్ భారీ సిక్సర్ బాదాడు. 137 కిమీల వేగంతో బ్లెస్సింగ్ ముజరబాని వేసిన డెలివరీని స్టేడియం బయట పడేలా బాదాడు. ఈ సిక్సర్ ఏకంగా 104 మీటర్ల దూరం వెళ్లింది. ఆ సమయంలో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అకీల్ హొస్సేన్ ఈ మాన్స్టర్ సిక్సర్ చూసి షాకైపోయాడు. నెత్తిన చేతులు పెట్టుకొని నోరు తెరిచి చూస్తుండిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Monstrous 104m Six Ft. Rovman Powell 🫡#WIvZIM | #T20WorldCup pic.twitter.com/80X0Eahh7b
— Shubham 🇮🇳 (@sokanpuriya) October 19, 2022