వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన జట్టుకు రోహిత్ శర్మ (64), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (0) మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. రిషభ్ పంత్ (14) ఆకట్టుకోలేదు. హార్దిక్ పాండ్యా (1) కూడా నిరాశపరిచాడు.
ఇలా ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో నిలబడి చూడచక్కని ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ కూడా హోల్డర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కాసేపటికే జడేజా (16) కూడా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో అశ్విన్ (13 నాటౌట్) అండగా చెలరేగిన దినేష్ కార్తీక్ (41 నాటౌట్) మరోసారి మెరుపులు మెరిపించాడు. అతను చెలరేగడంతో చివరి రెండు ఓవర్లలో భారత జట్టు 36 పరుగులు రాబట్టింది. అశ్విన్ కూడా ఒక సిక్సర్ బాదాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ఓబెడ్ మెకాయ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, కీమో పాల్ తలో వికెట్ తీసుకున్నారు.
💥🏏 THE FINISHER! How good was DK in the death overs today? He ended his knock with a strike rate of 215.78.
😍 This knock of his included six wonderful boundaries!
📸 Getty • #INDvWI #WIvIND #INDvsWI #DineshKarthik #TeamIndia #BharatArmy pic.twitter.com/tYvngB6xv7
— The Bharat Army (@thebharatarmy) July 29, 2022