గత కొన్నాళ్లుగా ప్రయోగాల పేరిట ఓపెనింగ్ జోడీని మారుస్తున్న టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, రుతరాజ్ గైక్వాడ్ వంటి వాళ్లు ఉండగా వారిని పక్కనబెట్టి రోహిత్ శర్మతో సూర్యకుమార్ యాదవ్‌ను ఎందుకు ఓపెనర్‌గా పంపుతున్నారని టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్ కృష్ణమచారి శ్రీకాంత్ కూడా ప్రశ్నలు సంధించాడు.
వెస్టిండీస్‌తో గడిచిన రెండు టీ20లలో రోహిత్ శర్మకు జోడీగా సూర్యకుమార్ యాదవ్‌నే పంపింది టీమ్ మేనేజ్మెంట్. కానీ ఈ జోడీ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఆడగల మెరుగైన ఆటగాడు. ఆ స్థానంలో అతడు కుదురుకున్నాడు. అతడిని తీసుకొచ్చి ఓపెనర్‌గా పంపడానికి గల కారణాలేంటి..? ఇషాన్ కిషన్ ఎక్కడ..? అతడిని ఎందుకు ఆడించడం లేదు…’అని ప్రశ్నించాడు.
గడిచిన రెండు మ్యాచ్‌లలో ఈ జోడీ దారుణంగా విఫలమైన నేపథ్యంలో మంగళవారం జరుగబోయే మూడో టీ20లో రోహిత్‌కు జంటగా ఇషాన్ కిషన్‌ను పంపే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా గడిచిన రెండు మ్యాచ్‌లలో విఫలమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కూడా దీపక్ హుడాను తుది జట్టులో చేర్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు సమాచారం.
ఇక టీ20 ప్రపంచకప్ ముందున్న తరుణంలో ప్రయోగాలు చేస్తున్న జట్టు యాజమాన్యం.. ఇప్పటికే తానెంటో నిరూపించుకున్న భువనేశ్వర్‌ను ఎందుకు ఆడిస్తుందని శ్రీకాంత్ ప్రశ్నించాడు. ‘భువనేశ్వర్‌ను ఎందుకు ఆడిస్తున్నారు. హర్షల్ పటేల్ ఎక్కడ..?’ అని ప్రశ్నించాడు.