IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ ఫ్యాన్స్‌కు అసలైన క్రికెట్ మజాను ఇచ్చింది. రెండేళ్ల తర్వాత సొంత గడ్డపై అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలను చూసే అవకాశం కల్పించింది. కుర్రాళ్లు అదరగొట్టిన ఈ సీజన్లో రికార్డు స్కోర్లు నమోదయ్యాయి. పవర్ హిట్టర్లు సిక్సర్ల మోత మోగించారు. ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టింది ఎవరంటే..? గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill), ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్(Rashid Khan). వీళ్లిద్దరు కూడా ముంబై ఇండియన్స్‌పైనే ఈ ఫీట్ సాధించారు.
ముంబై బౌలర్లపై 10 సిక్స్‌లతో విరుచుకుపడిన రషీద్ ఐపీఎల్ కెరీర్లో తొలి అర్ద శతకం నమోదు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్(చెన్నై సూపర్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(కోల్‌కతా నైట్ రైడర్స్), లివింగ్‌స్టోన్(పంజాబ్ కింగ్స్) 9 సిక్స్‌లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానం దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్(ముంబై ఇండియన్స్), యశస్వీ జైస్వాల్(రాజస్థాన్ రాయల్స్), గ్లెన్ మ్యాక్స్‌వెల్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) 8 సిక్సర్లతో ఆరు, ఏడు, ఎనిమిదవ, తొమ్మిది, పదవ స్థానంలో నిలిచారు. 7 సిక్స్‌లు కొట్టిన నికోలస్ పూరన్(లక్నో సూపర్ జెయింట్స్) 11వ స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్లో తొలి ఫిఫ్టీ బాదిన రషీద్ ఖాన్(గుజరాత్ టైటాన్స్)
1.శుభ్‌మన్ గిల్(గుజరాత్ టైటాన్స్) – 10 సిక్స్‌లు
2. రషీద్ ఖాన్ (గుజరాత్ టైటాన్స్) – 10 సిక్స్‌లు
3. రుతురాజ్ గైక్వాడ్(చెన్నై సూపర్ కింగ్స్) – 9 సిక్స్‌లు
4. వెంకటేశ్ అయ్యర్(కోల్‌కతా నైట్ రైడర్స్) – 9 సిక్స్‌లు
5. లివింగ్‌స్టోన్(పంజాబ్ కింగ్స్) – 8 సిక్స్‌లు
6. కామెరూన్ గ్రీన్(ముంబై ఇండియన్స్) – 8 సిక్స్‌లు
7. యశస్వీ జైస్వాల్(రాజస్థాన్ రాయల్స్) – 8 సిక్స్‌లు
8. గ్లెన్ మ్యాక్స్‌వెల్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) – 8 సిక్స్‌లు
9. మార్కస్ స్టోయినిస్ (లక్నో సూపర్ జెయింట్స్) – 8 సిక్స్‌లు
10. శుభ్‌మన్ గిల్(గుజరాత్ టైటాన్స్) – 8 సిక్స్‌లు