Jitesh Sharma : యువ వికెట్ కీపర్- బ్యాటర్ జితేశ్ శర్మ జాక్‌పాట్ కొట్టేశాడు. శ్రీలంకతో జరగనున్న రెండో టీ20కు అతను ఎంపికయ్యాడు. జితేశ్ భారత జట్టుకు సెలక్ట్ కావడం ఇదే మొదటిసారి. మోకాలి గాయంతో బాధపడుతున్న సంజూ శాంసన్ ప్లేస్‌లో జితేశ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా శాంసన్ గాయపడ్డాడు. అతను ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. దాంతో, మిగిలిన రెండు టీ20లకు అతని ప్లేస్‌లో జితేశ్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడడం, కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో జితేశ్‌కు అవకాశం లభించింది.
ఎవరీ జితేశ్ శర్మ..
మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టిన జితేశ్ వికెట్ కీపర్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ కూడా. ఐదు, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. దేశవాళీ క్రికెట్లో విదర్భకు ఆడాడు. 2012-13 సీజన్లో జరిగిన కూచ్ బెహర్ ట్రోఫీలో 537 రన్స్ చేశాడు. దాంతో, విదర్భ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. 2014లో విజయ్ హజారే ట్రోఫీలో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. 2015-16లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాప్ స్కోరర్ (343)గా నిలిచాడు.
2016 ఐపీఎల్ వేలంలో జితేశ్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. 2019లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. జితేశ్ ఐపీఎల్లో ఆరంగ్రేటం చేశాడు. ఐపీఎల్ 2022 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్‌కు జితేశ్‌ను దక్కించుకుంది. పోయిన ఏడాది 10 ఇన్నింగ్స్‌ల్లో 234 రన్స్ చేశాడు. ఈ లీగ్‌లో అతడి అత్యధిక స్కోర్ 44. ఢిల్లీ క్యాపిటల్స్ మీద 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఈ యంగ్‌స్టర్ ఇప్పటివరకు 76 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 147.93 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధించాడు.