స్టేడియంలో నమాజ్ ఎవరు చేయమన్నారు? పీసీబీకి కౌంటరిచ్చిన పాక్ మాజీ క్రికెటర్
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడం, భారత అభిమానులు ‘జై శ్రీరాం’ అని నినదించడం, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఫిర్యాదు చేయడం వివాదాస్పదమదువుతున్నది.
గత శనివారం అహ్మదాబాద్ వేదికగా ముగిసిన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడం, భారత అభిమానులు ‘జై శ్రీరాం’ అని నినదించడం, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఫిర్యాదు చేయడం వివాదాస్పదమదువుతున్నది. తాజాగా దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా పీసీబీకి కౌంటరిచ్చాడు. ఈ వ్యవహారంలో బీసీసీఐని, ఐసీసీని నిందించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితువు పలికాడు.
పీసీబీ మీడియా షేర్ చేసిన ట్వీట్‌పై కనేరియా స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ జర్నలిస్టు జైనబ్ అబ్బాస్ ఇండియా, అక్కడి హిందూవులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయమని ఎవరుచెప్పారు..? భారత్-పాక్ మధ్య అహ్మదాబాద్ మ్యాచ్ తర్వాత మికీ ఆర్థర్‌ను ఇది బీసీసీఐ ఈవెంట్ అని ఎవరు చెప్పమన్నారు..? ప్లేగ్రౌండ్‌లో రిజ్వాన్‌ను నమాజ్ చేయమని ఎవరుచెప్పారు..? ఇతరుల్లో తప్పులను వెతక్కండి..’అని ఘాటుగా ట్వీట్ చేశాడు.
Who asked Pakistani journalist Zainab Abbas to comment against India and Hindus?
Who asked Mickey Arthur to call ICC event as BCCI event?
Who asked Rizwan to perform Namaz in playground?
Don’t find faults in others! https://t.co/zpK7F7zjB7
— Danish Kaneria (@DanishKaneria61) October 17, 2023
భారత్‌తో మ్యాచ్‌లో రిజ్వాన్ ఆట మధ్యలోనే నమాజ్ చేయగా.. అతడు ఔట్ అయి పెవిలియన్‌కు వెళ్తుండగా భారత అభిమానులు ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేశారు. భారత అభిమానులు తమ క్రికెటర్లపై వ్యవహరించిన తీరుపై పీసీబీ.. ఐసీసీకి ఫిర్యాదుచేసింది. అంతేగాక పాకిస్తాన్ జర్నలిస్టులకు వీసాలు ఆలస్యం చేయడం, పాక్ ఫ్యాన్స్‌కు వీసాలు నిరాకరించడం వంటివాటిపై ఐసీసీకి ఫిర్యాదుచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

