Suhana Khan | అప్పుడే పాపులర్ బ్రాండ్ ప్రమోషన్లో స్టార్ హీరో కూతురు..!
Suhana Khan | కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల కూతుళ్లు లీడింగ్ బ్రాండ్స్ ప్రమోషన్లో పాల్గొనడం చాలా అరుదైన విషయమే అని చెప్పాలి. కేవలం ఒక్క సినిమా చేసి ఈ జాబితాలోకి వచ్చేసింది స్టార్ యాక్టర్ కూతురు.
Suhana Khan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు పాపులర్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే స్టార్ హీరోల కూతుళ్లు కెరీర్ తొలినాళ్లలోనే లీడింగ్ బ్రాండ్స్ ప్రమోషన్లో పాల్గొనడం చాలా అరుదైన విషయమే అని చెప్పాలి. కేవలం ఒక్క సినిమా చేసి ఈ జాబితాలోకి వచ్చేసింది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ (Suhana Khan). The Archies సినిమాతో డెబ్యూ ఇవ్వగా.. థియేటర్లలో విడుదలవుతుందనుకున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోకపోయినా సుహానా ఖాన్ నటనపై అందరూ ప్రశంసలు కురిపించారు. కాగా ఈ స్టార్ కిడ్ పాపులర్ సోప్ బ్రాండ్ లక్స్‌కు బ్రాండ్ అంబాడిసర్‌గా వ్యవహరిస్తుందన్న వార్త ఇప్పుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. గత ఐదు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలోని బడా స్టార్లు మాత్రమే ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు. ఇప్పుడు సుహానా ఖాన్ ఈ అవకాశం కొట్టేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ యాడ్ కోసం సుహానా ఖాన్ భారీ మొత్తాన్నే తీసుకుందని ఇన్సైడ్ టాక్.
ప్రస్తుతం సుజయ్ ఘోష్ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది సుహానా ఖాన్. మొత్తానికి అతితక్కువ టైంలోనే ఎండార్స్మెంట్ డీల్స్ చేసుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

