World Cup 2023 | వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్.. ప్రేక్షకులు లేక వెలవెలబోయిన స్టేడియం.. Video
World Cup 2023 | అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠ్మాతక వన్డే ప్రపంచకప్ (Cricket Worldcup) మ్యాచ్‌లు షురూ అయ్యాయి.
World Cup 2023 | అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠ్మాతక వన్డే ప్రపంచకప్ (Cricket Worldcup) మ్యాచ్‌లు షురూ అయ్యాయి. తొలిసారి భారత్ ఒంటరిగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైంది. ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ (England vs New Zealand) మధ్య పోరుతో టోర్నీ ఆరంభమైంది.
అయితే, టోర్నీ తొలిమ్యాచ్ అంటే ఎలా ఉండాలి.. ప్రేక్షకులకు కిక్కిచ్చేలా ఉండాలి. ప్రేక్షకుల హడావుడి, ఈలలు, చీర్స్, గెంతులు ఇలా ఒకటేంటి.. ప్రేక్షకుల సందడి మధ్య రెండు జట్లు తలపడుతుంటే చూసేందుకు రెండూ కళ్లూ చాలవు. కానీ నేడు జరుగుతున్న మ్యాచ్ మాత్రం ఎంతో చప్పగా, బోరింగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంప్ ఇంగ్లండ్, గత వరల్డ్ కప్ రన్నర్ న్యూజిలాండ్ జట్లు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల సందడి కరవైంది. దాదాపు 1.5 లక్షల మేర సీటింగ్ కెపాసిటీ కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రేక్షకులు లేక వెలవెలబోతోంది. స్టేడియంలోని కుర్చీలన్నీ ఖాళీగా (Empty Stands) దర్శనమిస్తున్నాయి. అక్కడొకరూ అక్కడొకరు మాత్రమే కనిపిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా స్టేడియం ఖాళీగా దర్శనమివ్వడంపై పలురకాలుగా స్పందిస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం అంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇంత పెద్ద క్రికెట్ ఉత్సవంలో ప్రారంభ వేడుకలు లేకుండానే పోటీలు మొదలుపెట్టడం గమనార్హం.
Really hope the Stadium gets filled a bit by evening.
The World Cup opener deserves more public on the stands! pic.twitter.com/oDknm9qEGD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023
It’s pretty big!! 😨 pic.twitter.com/b4wCqI7Q16
— Alexandra Hartley (@AlexHartley93) October 5, 2023
Where’s the crowd !?🤔🤔
— Danielle Wyatt (@Danni_Wyatt) October 5, 2023
Opening match of World Cup 2023 in front of empty stands. Yeh tickets toh Sold out ho gayi thi na ??
Its Sad 😢#ENGvNZ #CWC23 #ICCCricketWorldCup pic.twitter.com/CzVURVw1NR
— 𝙍𝘼𝙅𝙈𝘼 𝘾𝙃𝘼𝙒𝘼𝙇 𓆩♡𓆪 (@RajmaChawalGG) October 5, 2023
A complete empty Stadium in Ahmedabad. #WorldCup2023 pic.twitter.com/SMkc17Jv6J
— Somi ✨️ (@cricketedit16_) October 5, 2023
Also Read..
Babar Azam | హైదరాబాద్ బిర్యానీకి బాబర్ రేటింగ్.. ఎన్ని మార్కులు ఇచ్చారంటే..
CWC | నేటి నుంచి క్రికెట్ మెగాటోర్నీ.. తొలి పోరులో కివీస్‌తో ఇంగ్లండ్ ఢీ
MS Dhoni | ధోనీ బుగ్గపై ముద్దుపెట్టిన స్టార్ హీరో.. పిక్స్ వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

