MS Dhoni | ధోనీ బుగ్గపై ముద్దుపెట్టిన స్టార్ హీరో.. పిక్స్ వైరల్
MS Dhoni | టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.
MS Dhoni | టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ధోనీ బుగ్గపై రణ్వీర్ ముద్దు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రణ్వీర్ ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశారు. ఈ ఫొటోలకు ‘మేరే మహీ..’ (Mera Mahi) అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా, టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) కూడా మహీని కలిసిన విషయం తెలిసిందే. బుధవారం ముంబైలో ధోనీని కలిశారు. వీరిద్దరూ ఒక యాడ్ షూట్ కోసం కలుసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మిస్టర్ కూల్‌తో మెగా పవర్ స్టార్ మీట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు ధోనీ(MS Dhoni).. కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. చాలా స్టయిలిష్ లుక్‌తో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త తరహా హెయిర్ స్టయిల్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో టార్జన్ తరహా హెయిర్ స్టయిల్‌తో కిక్ ఇచ్చిన ధోనీ, మళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో ఆకట్టుకుంటున్నాడు. యాడ్ షూట్ కోసమే ధోనీ ఇలా కొత్త లుక్కు మారినట్లు తెలుస్తోంది.
Also Read..
Babar Azam | హైదరాబాద్ బిర్యానీకి బాబర్ రేటింగ్.. ఎన్ని మార్కులు ఇచ్చారంటే..
Amitabh Bachchan | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. అమితాబ్ బచ్చన్‌కు భారీ జరిమానా..!
Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరీ చేసిన ఫ్యామిలీ కోర్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

