ఇంగ్లండ్‌లో పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుందన్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆడే తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లీసెస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో. అప్టాన్స్టీల్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ తర్వాత విశ్రాంతి తీసుకున్న టీమిండియా సీనియర్లు కోహ్లీ, రోహిత్, పుజారా, బుమ్రా, జడేజా అందరూ ఈ ప్రాక్టీస్ మ్యాచులు ఆడతారు.
గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఏ టీవీ ఛానెల్లోనూ ఈ మ్యాచ్ బ్రాడ్కాస్ట్ కాదు. అయితే లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
కాబట్టి అందరూ ఉచితంగానే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. యూట్యూబ్‌లో ‘‘ఫాక్సెస్ టీవీ’’ (Foxes TV)లో మ్యాచ్ ప్రత్యక్షప్రసారం అవుతుంది.