Champions Trophy | మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) టీమిండియా సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి కరుణ్ నాయర్ (Karun Nair)ను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ 700 కంటే ఎక్కువ పరుగులే చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఫామ్, ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడడంలో ఏదైనా ప్రయోజనం ఉందా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. కరుణ్ నాయర్ విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒక సీజన్లో ఐదు సెంచరీలు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దాదాపు 400 సగటుతో 779 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలో టోర్నమెంట్లో ఎనిమిది.. అంతకంటే ఎక్కువ మ్యాచులు ఆడిన ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఇదే అత్యుత్తమం.
Read Also : Suresh Raina | చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఫామ్‌లోకి వస్తడు.. దంచికొడుతడు : సురేశ్ రైనా
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే జట్టులో మార్పు చేసే కరుణ్ నాయర్‌కు అవకాశం ఉంది. చాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా, శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అయితే, ప్రస్తుతం రిజర్వ్ ఆటగాళ్ల గురించి టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించడం లేదని తెలుస్తున్నది. టీమిండియా గురించి మాట్లాడితే ఈ సారి చాంపియన్స్ ట్రోఫీలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది. దాదాపు 14 నెలల విరామం తర్వాత మహ్మద్ షమీ తిరిగి వన్డే జట్టులోకి చేరాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. జట్టులో నలుగురు ఆల్రౌండర్లకు చోటు కల్పించింది.
ఇదిలా ఉండగా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
జట్టులో గాయపడిన ఆటగాళ్లు ఉన్నారని తెలిసిన సమయంలో జట్టులో మరో ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోవచ్చని చెప్పాడు. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీకి సరైన మార్గంలోనే ఉన్నాడని.. వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. సిరాజ్‌ను తీసుకోకపోవడానికి కారణం పనిభారం కావచ్చొని చెప్పాడు. అయితే, వన్డేల్లో సిరాజ్ గణాంకాలు బాగున్నాయని గుర్తు చేశాడు. సంజు శాంసన్ విషయంలో నిరాశకు గురైనట్లు తెలిపాడు. సెలెక్టర్లు నితీశ్‌కుమార్ రెడ్డిని సైతం పరిగణలోకి తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం స్పందించాడు. జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని పేర్కొన్నారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే ఎంపిక చేశారని.. వారిలో ఇద్దరు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయి వేదికగా జరిగే టోర్నీకి తానయితే స్పిన్ ఆల్‌రౌండర్‌కు బదులుగా సిరాజ్‌ను తీసుకునేవాడినని చెప్పారు.
Is there a point playing Domestic cricket when you don’t pick players based on form & performance ? #KarunNair
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 18, 2025