Shane Dowrich | వెస్టిండీస్ బోర్డుకు పెద్ద షాక్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వికెట్ కీపర్
Shane Dowrich : వెస్టిండీస్ వికెట్ కీపర్ షేన్ డౌరిచ్(Shane Dowrich) విండీస్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన డౌరిచ్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2020 డిసెంబర్లో చివరిసారి దేశానికి ప్రాతినిధ్యం వహించిన డౌరిచ్ తన ఎనిమిదేండ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఈ సందర్భంగా విండీస్ క్రికెట్ డైరెక్టర్...
Shane Dowrich : వెస్టిండీస్ వికెట్ కీపర్ షేన్ డౌరిచ్(Shane Dowrich) విండీస్ క్రికెట్ బోర్డుకు పెద్ద షాకిచ్చాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన డౌరిచ్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2020 డిసెంబర్లో చివరిసారి దేశానికి ప్రాతినిధ్యం వహించిన డౌరిచ్ తన ఎనిమిదేండ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఈ సందర్భంగా విండీస్ క్రికెట్ డైరెక్టర్ మిల్సే బాస్కాంబే.. డౌరిచ్ సేవల్ని కొనియాడాడు.
‘వెస్టిండీస్ క్రికెట్‌కు అద్భుత సేవలు అందించినందుకు డౌరిచ్‌కు ధన్యవాదాలు. సొంతగడ్డపై 2019లో బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో డౌరిచ్ సెంచరీతో చెలరేగి.. విజ్డెన్ ట్రోఫీ(Wiseden Trophy) గెలవడంలో కీలక పాత్ర పోషించాడు’ అని మిల్సే ఓ ప్రకటనలో తెలిపాడు.
Shane Dowrich has announced his retirement from international cricket and will not be part of the upcoming CG United ODI Series in Antigua and Barbados
Full story: https://t.co/I1gxAlJzlc
— Windies Cricket (@windiescricket) November 30, 2023
డౌరిచ్ 2015లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడాడు. డౌరిచ్ దేశం తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు. 2019లో బంగ్లాదేశ్‌పై ఏకైక వన్డేలో వెస్టిండీస్ జెర్సీ వేసుకున్నాడు. అయితే.. తీరా ఇంగ్లండ్ పర్యటనకు ముందు డౌరిచ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ బోర్డు సభ్యులు తలపట్టుకుంటున్నారు. అతడి స్థానంలో విండీస్ సెలెక్టర్లు మరొకరిని ఎంపిక చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
-
Rathnam | విశాల్ 34కు రత్నం టైటిల్.. ఫస్ట్ షాట్ అదిరిందంతే..!
-
Tirumala | నవంబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ?
-
FIFA | ఫిఫా వరల్డ్ కప్ 2030.. ఆతిథ్యం కోసం పోటీపడుతున్న దేశాలివే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

