Musi Riverfront Development | మూసీలో నురగలాంటిదే.. లక్షన్నర కోట్లని చెప్పి 1500 కోట్లు ఇచ్చారు
“మూడేళ్లలో మూసీని థేమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్‌కు వన్నెతీసుకువస్తాం. విశ్వనగరానికి ప్రతీకగా, ప్రపంచ స్థాయిలో మూసీని తీర్చిదిద్దుతాం” అంటూ మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటిదేనని తేలిపోయింది.
- మూసీ ప్రక్షాళనపై ఆర్భాటంగా ప్రకటనలు
- కేటాయింపుల్లో లేని ప్రాధాన్యత
- వ్యయంలో 1 శాతమే కేటాయింపు
- భూసేకరణకే సరిపోని నిధులు
Musi Riverfront Development | సిటీబ్యూరో, జులై 25 (నమస్తే తెలంగాణ) : “మూడేళ్లలో మూసీని థేమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్‌కు వన్నెతీసుకువస్తాం. విశ్వనగరానికి ప్రతీకగా, ప్రపంచ స్థాయిలో మూసీని తీర్చిదిద్దుతాం” అంటూ మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటిదేనని తేలిపోయింది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా చెప్పుకుంటూ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ బీరాలు పోయింది.
ఖర్చు చేసుడు దేవుడెరుగు కనీసం మూసీ కేటాయింపుల్లోనే అత్తెసరు నిధులతో లెక్కలు చూపించింది. ఇక లెక్కలు తేలి, పనులు మొదలుపెట్టాలంటే బారెడు ఖర్చతో కూడుకున్న మూసీ సుందరీకరణ మూరెడు నిధులతో ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేటాయించిన రూ. 1500 కోట్లు 56కిలోమీటర్ల విస్తరించి ఉన్న భూసేకరణకు కూడా సరిపోయేలా లేవని అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ప్లాగ్షిప్కు ఒక్క శాతం నిధులు..
మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు నదికి ఇరువైపులా ఉన్న సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది. దాదాపు 55 కిలోమీటర్ల మేర 12వేలకు పైగా ఆక్రమ నిర్మాణాలను గుర్తించింది. ఇందులో ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖ ఆస్తులతోపాటుగా పట్టా భూములు కూడా ఉన్నాయి. వీటన్నింటిని తొలగించి మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే భూసేకరణకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓ అంచనా ప్రకారం ఇప్పటివరకు లెక్కతేల్చిన మొత్తం నిర్మాణాల్లో 60 శాతం నిర్మాణాలకు పరిహారాన్ని చెల్లించాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇక డీపీఆర్, ప్రాజెక్టు నిర్మాణం, మౌలిక వసతుల పేరిట భారీ మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూసీపై ఉన్న వంతెనల నిర్మాణం, ఆధునీకరణ, ఎస్టీపీల నిర్మాణం, మురుగు నీటిని తరలింపు వంటి అంశాలకు భారీ వేలలో ఖర్చు చేయాల్సి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
కానీ ప్రభుత్వం కేటాయించిన రూ. 1500 కోట్లు మూసీ అభివృద్ధిలో దేనికోసం ఖర్చు చేయాలనే విషయంలో ఇప్పటికీ అధికారులు స్పష్టత లేకుండా పోయింది. మూసీ మురుగును తొలగించడమే తన లక్ష్యమని, తనకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పుకుంటూ, ప్రాజెక్టు వ్యయాన్ని మూడు నెల్లో లక్షన్నర కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి పెంచేశారు. ఆ స్థాయి ప్రాజెక్టుకు మొత్తం అంచనా వ్యయంలో ఒక్కశాతం నిధులను కేటాయించడం, ప్రాజెక్టును ఆచరణలో పెట్టడం ఎలా సాధ్యం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం మూసీ సుందరీకరణ కోసం ఇప్పటివరకు ఆహ్వానించిన టెండర్లను అమలు చేయాలంటేనే కనీసం 400-500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కేటాయించిన నిధులతో మూసీ ఎలా మురిపిస్తారంటూ నగర వాసులు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

