Shannon Gabriel : వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షనాన్ గాబ్రియెల్(Shannon Gabriel)క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు అతడు వెల్లడించాడు. దాంతో, అతడి 12 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముంగిపు పడనుంది. ఈ విషయాన్ని గురువారం 36 ఏండ్ల గాబ్రియెర్ ఓ ప్రకటనలో తెలిపాడు.
‘ఈ పన్నెండు ఏండ్ల కాలంలో దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకే అంకితమయ్యాను. అంతర్జాతీయ వేదికల మీద క్రికెట్ ఆడడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అయితే.. అన్ని మంచి విషయాలు కూడా ఏదో రోజు ముగుస్తాయి కదా? అని’ గాబ్రియెల్ తన పోస్ట్‌లో వెల్లడించాడు.
Thank you, Shango!🫶🏾
You played with heart and passion, and your contribution to our beloved sport will forever be etched in the pages of our history.❤️
WI wish you the best in your next chapter.🏏#WISaluteYou pic.twitter.com/teTyBlbQlg
— Windies Cricket (@windiescricket) August 28, 2024
అంతేకాదు వెస్టీండీస్కు ఆడినన్ని రోజులు నా కుటుంబం, నేను ఎన్నో అవకాశాలు అందుకున్నాం. అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇన్ని ఏండ్లలో నాకు సహరించిన వెస్టిండీస్ క్రికెట్ అధికారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, ఆటగాళ్లకు ధన్యవాదాలు.ఇకపై ట్రినిడాడ్ అంట్ టొబాగో జట్టుకు ఆడుతా. ఫ్రాంచైజీ క్రికెట్ మీద ఫోకస్ పెడుతా’ అని గాబ్రియెట్ అన్నాడు. కరీబియన్ జట్టు తరఫున ఈ పేసర్ ఇప్పటివరకూ 86 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 59 టెస్టులు ఉండడం విశేషం.
Shannon Gabriel at full throttle against Rahane!#MenInMaroon pic.twitter.com/hnHs6NSOPa
— Windies Cricket (@windiescricket) August 28, 2024
కుడి చేతివాటం పేసర్ అయిన గాబ్రియెల్ 2012లో లార్డ్స్‌లో ఇంగ్లండ్ మీద టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌తో మొదలైన అతడి ప్రభంజనం పదేండ్ల పాటు కొనసాగింది. తనకు ఎంతో అచ్చొచ్చిన సుదీర్ఘ ఫార్మాట్లో ఈ స్పీడ్‌స్టర్ 32.21 సగటుతో 166 వికెట్లు పడగొట్టాడు. అందులో ఆరుసార్లు అతడు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
Shannon Gabriel announces international retirement after 12 years for West Indies 🌴
READ MORE: https://t.co/X92D9WEc3r pic.twitter.com/nE9TDnTwp3
— ESPNcricinfo (@ESPNcricinfo) August 28, 2024
టెస్టుల్లో విజయవంతమైన గాబ్రియెల్ శ్రీలంకపై అత్యుత్తమ గణాంకాలు (13/121)నమోదు చేశాడు. గాబ్రియెల్ చివరిసారి భారత్‌పై స్వదేశంలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో నిరుడు ఆఖరి టెస్టు ఆడాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ అవకాశాలు రాలేదు. దాంతో, ఆటకు అల్విదా పలకాలని నిర్ణయించుకున్నాడు.