న్యూఢిల్లీ: అజ్మీర్‌లోని ఖాజా మొయినుద్దీన్ చిస్తు దర్గా(Ajmer Dargah)కు ప్రధానమంత్రి మోదీ చాదర్ సమర్పించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆ చాదర్‌ను తీసుకెళ్లారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం ఆ దర్గాకు చాదర్‌ను పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీకి చెందిన స్పెషల్ వెకేషన్ బెంచ్ ఆ పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. తక్షణమే తమ పిల్‌ను స్వీకరించాలని కోరిన పిటీషనర్లకు కోర్టు షాకిచ్చింది. అజ్మీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో పీఎంవో చాదర్‌ను పంపింది. అయితే ప్రధాని తరపున ఆ చాదర్‌ను దర్గాకు పంపడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని పిల్లో వాదించారు. అజ్మీదర్ దర్గాను శివుడి గుడిపై కట్టారని, హిందూ సేన ప్రెసిడెంట్ విష్ణు గుప్త వేసిన పిటీషన్ ఇంకా విచారణలో ఉన్నదని తమ పిల్లో వాదించారు. భగవాన్ శ్రీ సంకటమోచన్ మహాదేవ్ విరాజ్మాన్ ఆలయంపై రాజస్థాన్ కోర్టులో పిటీషన్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.