ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan)పై హత్య కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆయన్ను జట్టు నుంచి తొలగించాలని కూడా బంగ్లా బోర్డుకు లీగల్ నోటీసులు వెళ్లాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆడుతున్న షకీబ్.. ఆ సిరీస్‌లో కొనసాగనున్నట్లు బీసీబీ అధ్యక్షుడు ఫారూకే అహ్మద్ తెలిపారు. పాక్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. షకీబ్ ఆటను కొనసాగిస్తాడని, వెనక్కి తీసుకురావాలన్న లీగల్ నోటీసులకు రిప్లై ఇచ్చామని, షకీబ్ తన ఆటను కొనసాగిస్తూనే ఉంటాడని బీసీబీ అధ్యక్షుడు ఫారూకే తెలిపారు.
షకీబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దర్యాప్తు తొలి దశలో ఉన్నదని, అతన్ని దోషిగా తేల్చే వరకు .. క్రికెట్ ఆడుతుంటాడని ఫారూకే చెప్పారు. పాకిస్థాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌తో జరిగే సిరీస్‌కు బంగ్లా జట్టు వెళ్లనున్నది. భారత్‌తో జరిగే సిరీస్‌లోనూ షకీబ్ ఆడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. షకీబ్ కాంట్రాక్టు ఆటగాడని, ఒకవేళ కావాలంటే అతని న్యాయ సాయం చేస్తామని ఫారూక్ వెల్లడించారు.
సెప్టెంబర్ 3 నుంచి పాక్‌తో రెండో టెస్టు ప్రారంభం అవుతుంది. ఆ మ్యాచ్ తర్వాత అతను నేరుగా సర్రీ తరపున ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. కౌంటీల్లో ఆడేందుకు బంగ్లాదేశ్ బోర్డు నుంచి ఎన్ఓసీ కూడా పొందాడు. భారత్‌తో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్నటెస్టు సిరీస్‌లో షకీ్ ఆడనున్నాడు.