బ్రిడ్జ్‌టౌన్: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup) గ్రూప్ 2 లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో.. వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో అమెరికాపై విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అమెరికా కేవలం 128 రన్స్ మాత్రమే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని విండీస్ చాలా ఈజీగా ఛేజ్ చేసింది. ఓపెనర్ షాయ్ హోప్ పవర్ హిట్టింగ్తో చెలరేగిపోయాడు. అతను 39 బంతుల్లో 8 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 82 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్ పూరన్ 27 రన్స్‌తో నాటౌట్‌గానే ఉన్నాడు.
భారీ విక్టరీతో సెమీస్‌లో చోటు దక్కించుకునే అవకాశాన్ని విండీస్ పదిలం చేసుకున్నది. చాలా వేగంగా స్కోర్ చేయడం వల్ల విండీస్ నెట్ రన్ రేట్ సౌతాఫ్రికా కన్నా మెరుగ్గా ఉన్నది. దీంతో అమెరికాపై ఒకవేళ ఇంగ్లండ్ గెలిచినా, అప్పుడు సౌతాఫ్రికాపై విండీస్ గెలిస్తే, ఆ జట్టుకు సెమీస్ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అవుతుంది.
లో టార్గెట్ ఛేజ్‌లో విండీస్ ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ కొంత తడబడ్డా.. షాయ్ హోప్ మాత్రం తన షాట్లతో అలరించాడు. ఏకంగా 8 సిక్సర్లు బాది అమెరికా జట్టును జడిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును రోస్టన్ ఛేజ్ దక్కించుకున్నాడు. ఛేజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 19 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
విండీస్ బౌలర్లలో రస్సెల్ మూడు, జోసెఫ్ రెండు వికెట్లు తీసుకున్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆ జట్టుకు ఊపునిచ్చింది.అమెరికా బ్యాటర్లలో గౌస్ అత్యధికంగా 29 రన్స్ చేశాడు.
West Indies get their first win of the Super Eight stage and boost their net run rate 🙌#T20WorldCup | #USAvWI | 📝 https://t.co/iWdVidfgYA pic.twitter.com/F2VGTxOt37
— T20 World Cup (@T20WorldCup) June 22, 2024