ఢిల్లీ: నెల రోజులుగా దేశ రాజధానిలోని క్రికెట్ అభిమానులకు టీ20 మజాను పంచిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో రెండో సీజన్ టైటిల్‌ను వెస్ట్ ఢిల్లీ లయన్స్ గెలుచుకుంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్ ఢిల్లీ.. 6 వికెట్ల తేడాతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. యుగల్ సైని (65), ప్రాన్షు విజయరన్ (50) రాణించారు. అనంతరం ఛేదనలో కెప్టెన్ నితీశ్ రాణా 79 నాటౌట్ వీరవిహారం చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. 18 ఓవర్లలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదనను పూర్తిచేసింది.