కోల్‌కతా : ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్‌కతాలో పాల్గొన్న సాల్ట్‌లేక్ స్టేడియం ఘటన ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్కు షాకిచ్చింది. మెస్సీని చూడనీయలేదనే ఆగ్రహంతో సాల్ట్‌లేక్‌లో ప్రేక్షకులు విధ్వంసం సృష్టించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అరూప్ తన పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపగా ఆమె దానిని ఆమోదించి ఆ శాఖను పర్యవేక్షించే బాధ్యతను తీసుకున్నారు.