Wasim Akram : ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అత్యుత్తమ బౌలర్ అని పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్(Wasim Akram) పేర్కొన్నాడు. కొత్త బంతితో అతడు అత్యంత ప్రమాదకారి అని అక్రమ్ వెల్లడించాడు. ‘ప్రస్తుతం బుమ్రానే ప్రపంచ అత్యుత్తమ బౌలర్. ఈ జాబితాలో అగ్రస్థానం అతడికే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వరల్డ్‌కప్(ODI World Cup 2023)లో అతడి ప్రదర్శన చూసిన వారెవరైనా నా మాటలతో ఏకీభవిస్తారు. పిచ్‌కు అనుగుణంగా తన బౌలింగ్ శైలిని మార్చుకోవడం, పేస్‌తో పాటు వైవిధ్యాన్ని రాబట్టడంలో అతడిని మించిన బౌలర్ మరొకరు లేరు. అతడు ఒక పరిపూర్ణ ప్యాకేజ్‌లా ఉన్నాడు’ అని పాక్ దిగ్గజం వెల్లడించాడు. ప్రపంచ క్రికెట్లో స్వింగ్ కింగ్‌గా గుర్తింపు సాధించిన అక్రమ్ కొత్త బంతితో తనకన్నా బుమ్రానే ప్రమాదకరమని పేర్కొనడం గమనార్హం.
వికెట్ తీసిన బుమ్రాను అభినందిస్తున్న కెప్టెన్ రోహిత్
ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితలో ఆడమ్ జాంపా(16 వికెట్లు) అగ్రస్థానంలో ఉంటే.. ఆ తర్వాత మిషెల్ శాంట్నర్, బుమ్రా 14 వికెట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇగ్లండ్తో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ పెద్దగా ఆకట్టుకోలేక 229 పరుగులకే పరిమితమైన సమయంలో బుమ్రా తన బౌలింగ్ పదునుతో జట్టులో జవసత్వాలు నింపాడు. అద్భుతమైన బంతులతో బుమ్రా మూడు వికెట్లు పడగొడితే.. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు.