BCCI : తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసమాన పోరాటం కనబరిచిన భారత జట్టు (Team India) ఓటమి తప్పించుకోలేకపోయింది. ఐదో రోజు భారత బౌలర్లు రెండే రెండు వికెట్లు తీయగా న్యూజిలాండ్ 8 వికెట్లతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఇక సిరీస్ సమం చేయాలంటే పుణేలో రోహిత్ సేన చెలరేగాల్సిందే. అందుకని రెండో మ్యాచ్ కోసం స్క్వాడ్‌లో టీమిండియా ఓ మార్పు చేసింది.
చిన్నస్వామి స్టేడియంలో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడడంతో సెలెక్టర్లు కండ్లు తెరిచారు. స్క్వాడ్‌లో మార్పుకు తెరతీస్తూ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sunder)ను ఎంపిక చేశారు. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ఆడుతున్న సుందర్ త్వరలోనే జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ఆదివారం సాయంత్రం వెల్లడించింది. చివరి రెండు టెస్టులకు భారత్ 16 మంది బృందంతో కొనసాగనుందని బోర్డు స్పష్టం చేసింది.
🚨 News 🚨
Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBank
Details 🔽
— BCCI (@BCCI) October 20, 2024
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, బుమ్రా(వైస్ కెప్టెన్) ఆకాశ్ దీప్.
బెంగళూరు టెస్టులో టాస్ గెలిచి 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులతో రాణించింది. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని సర్ఫరాజ్ ఖాన్(150), రిషభ్ పంత్(99)లు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు మూడో రోజు కెప్టెన్ రోహిత్ శర్మ(52), విరాట్ కోహ్లీ(70)లు తమ తడాఖా చూపించారు.
New Zealand win the First Test by 8 wickets in Bengaluru.#TeamIndia will look to bounce back in the Second Test.
Scorecard ▶️ https://t.co/8qhNBrs1td#INDvNZ | @idfcfirstbank pic.twitter.com/6Xg4gYo8It
— BCCI (@BCCI) October 20, 2024
అయితే.. నాలుగో రోజు ఆఖరి సెషన్లో కొత్త బంతితో విలియం ఓరూర్కీ మాయ చేశాడు. వరుసగా పంత్, రాహుల్, జడేజాలను ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు. అనంతరం మ్యాట్ హెన్రీ చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 462 వద్ద ముగిసింది. 107 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్‌లో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య అక్టబోర్ 24వ తేదీన రెండో టెస్టు పుణేలో జరుగనుంది.