food poisoning | స్మారక కార్యక్రమంలో స్నాక్స్ తిని.. 200 మందికిపైగా అస్వస్థత
food poisoning | స్మారక కార్యక్రమానికి హాజరైన వారు అక్కడ సర్వ్ చేసిన స్నాక్స్ తిన్నారు. అనంతరం 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆసుపత్రిపాలయ్యారు.
గౌహతి: స్మారక కార్యక్రమానికి హాజరైన వారు అక్కడ సర్వ్ చేసిన స్నాక్స్ తిన్నారు. అనంతరం 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల (food poisoning) కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆసుపత్రిపాలయ్యారు. అస్సాంలోని గోల్ఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సరుపతర్ ప్రాంతం ఉరియమ్‌ఘాట్‌లోని పాస్ఘోరియా గ్రామంలో ప్రదీప్ గొగోయ్ తల్లి స్మారక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులకు సాంప్రదాయ ‘జల్పాన్’, పఫ్డ్ రైస్, క్రీమ్‌తో కూడిన స్నాక్స్ ఇచ్చారు. అది తిన్న సుమారు 200 మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఇబ్బందిపడ్డారు.
కాగా, 53 మందిని సరుపత్తర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఉరియమ్‌ఘాట్‌లోని పబ్లిక్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని జోర్హాట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. స్వల్ప లక్షణాలున్న 150 మందికి ప్రాథమిక చికిత్స తర్వాత ఇళ్లకు పంపివేశారు.
మరోవైపు ఆ గ్రామాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ సందర్శించి ఫుడ్ పాయిజన్ కారణాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫంక్షన్‌కు వచ్చిన వారందరి ఇళ్లకు వైద్య బృందాలను పంపి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

