CPR to snake : సాధారణంగా మనం పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. మళ్లీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడం. అలాంటిది ఓ యువకుడు మాత్రం ఏకంగా పాముకే సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పామును చేతిలో పట్టుకుని రెండు మూడు నిమిషాలపాటు ఊపిరి ఊదాడు. దాంతో పాముకు పోతుందనుకున్న ప్రాణం తిరిగి వచ్చింది. గుజరాత్లోని వడోదరలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక అడుగు పొడవున్న విషపూరిత పాము అపస్మారక స్థితిలో పడివుంది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న వన్యప్రాణి సంరక్షకుడు యశ్ తాడ్వి ఆ పామును చేతపట్టుకుని, దాని నోరు తెరిచి సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించాడు. మొదట పాము ఎలాంటి కదలిక లేకుండా బతికేలా కనిపించకపోయినా.. దాదాపు ఓ 3 నిమిషాల తర్వాత కదలడం మొదలు పెట్టింది. పాము స్పృహలోకి వచ్చిన తర్వాత దాన్ని పునరావాసం కోసం స్థానిక అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
Vadodara youth & Snake Rescuer Yash Tadvi brings Snake back to life with Mouth-to-Mouth CPR! #vadodara pic.twitter.com/MP1DFHLYst
— My Vadodara (@MyVadodara) October 16, 2024