చెన్నై: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా వైరస్ బారినపడ్డాడు. సఫారీ వేదికగా ఈనెల 19 నుంచి జరుగాల్సిన వన్డే సిరీస్‌లో సుందర్ ఆడే అవకాశం లేనట్టు కనిపిస్తున్నది. అతడి స్థానంలో హర్యానా ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌కు చాన్స్ దక్కే అవకాశం ఉంది. గాయం కారణంగా ఏడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్న సుందర్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. తమిళనాడు జట్టును రన్నరప్‌గా నిలుపడంతో కీలక పాత్ర పోషించాడు.