Vishmi Gunaratne : శ్రీలంక మహిళా జట్టు ఓపెనర్ విశ్మీ గుణరత్నే (Vishmi Gunaratne) చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తొలి శతకం బాదేసింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దంచికొట్టిన విశ్వీ మూడంకెల స్కోర్‌తో మెరిసింది. దాంతో, ఈ ఘనత సాధించిన లంక రెండో మహిళా క్రికెటర్‌గా విశ్మీ రికార్డు నెలకొల్పింది.
అంతేకాదు అన్ని ఫార్మట్లలో లంక తరఫున చిన్న వయసులోనే వంద కొట్టిన క్రికెటర్‌గా మరో రికార్డును విశ్వీ తన పేరిట రాసుకుంది. గుణరత్నే కంటే ముందు వన్డేల్లో చమరి ఆటపట్టు (Chamari Athapathuthu) శతక గర్జనతో చరిత్ర పుటల్లో నిలిచింది.
Women’s ODI hundreds for Sri Lanka:
Chamari Athapaththu (9)
Vishmi Gunaratne (1)Finally, a second centurion for 🇱🇰 in women’s limited-overs internationals 👏 https://t.co/Ax1uh30pJT #IREvSL pic.twitter.com/p63N0JIWBA
— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2024
బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీసెస్ క్రికెట్ క్లబ్లో శ్రీలంక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(0) డకౌట్ అయినా విశ్మీ గుణరత్నే(103) దూకుడుగా ఆడింది. హర్షిత మండవి()తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ యంగ్‌స్టర్ ఐర్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది.
Vishmi Gunaratne blasts her way into the record books with her maiden ODI century! The second Sri Lankan woman to achieve this feat.
What a moment!
Video Credit: @CricketIreland #SriLankaCricket #vishmigunarathne #SLvIRE pic.twitter.com/NhpWRbID2s
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 16, 2024
భారీ షాట్లతో విరుచుకుపడిన విశ్మీ 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకమోత మోగించింది. జట్టు స్కోర్ 157 పరుగుల వద్ద ఆమె ఔటయ్యాక.. హాసిని పెరీరా(46), సుగంధిక కుమారి(18), అనుష్క సంజీవని(17)లు ధనాధన్ ఆడారు. దాంతో, లంక ప్రత్యర్థికి 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.