Krishnaiah | మాజీ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో సామూహిక ఆమరణ దీక్షలు : కృష్ణయ్య
Krishnaiah | మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్ఫూర్తితో కులగణన, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపడుతామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్ఫూర్తితో కులగణన, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపడుతామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల, విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(Krishnaiah) మాట్లాడారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటీసీ అయ్యే అర్హత కూడా లేదా అని ప్రశ్నించారు. కులగణన చేయకుండా ప్రభుత్వం సాకులు చెబితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీసీల విశ్వసనీయత కోల్పోకముందే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సమగ్ర కులగణనపై ఆయా పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మాటను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు మాట్లాడుతూ ప్రాణాలు పోయినా సరే సామూహిక ఆమరణ దీక్ష చేసి సమగ్రకులగణన, 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, సోషల్‌జస్టిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిడికిలి రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

