Thangalaan | అతి సహజత్వమే తంగలాన్‌కు మైనస్‌గా మారింది!
తంగలాన్‌కు పోటీగా విడుదలైన సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలకు నెగెటివ్ టాక్ రావడంతో.. తంగలాన్ వాటి మీద బెటర్‌గా వుందని.. సినిమా రా రస్టిక్ ఫిల్మ్‌గా మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.
రొటిన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలకు కాలం చెల్లింది. వైవిధ్యమైన సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇదే కోవలో పూర్తి వైవిధ్యమైన నేపథ్యాన్ని, కథను ఎంచుకుని వచ్చిన చిత్రమే తంగలాన్. సాధారణంగా విక్రమ్ అనగనే విభిన్నమైన సినిమాతో పాటు అందులో అతని సరికొత్త గెటప్‌ను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఆయన గత సినిమాల్లో పోషించిన పాత్రలే అందుకు కారణం.
ఇక తంగలాన్ చిత్రంలో కూడా ఓ గిరిజన తెగ నాయకుడిగా… అత్యంత సహజమైన మేకప్‌తో, అచ్చం ఆదివాసి మనిషిలా కనిపించాడు విక్రమ్. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తంగలాన్‌కు పోటీగా విడుదలైన సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలకు నెగెటివ్ టాక్ రావడంతో.. తంగలాన్ వాటి మీద బెటర్‌గా వుందని.. సినిమా రా రస్టిక్ ఫిల్మ్‌గా మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో కొనసాగే ఈ కథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సహజత్వం కోసం దర్శకుడు ఎలాంటి కమర్షియల్ హంగులను యాడ్ చేయలేదు. కథ, కథనాలు చాలా నెమ్మదిగా కొనసాగాయి. సినిమా ప్రారంభం ఇంట్రెస్టింగ్గా మొదలైన… రాను రాను కాస్త బోరింగ్‌గా మారుతుంది. ఇందుకు స్క్రీన్‌ప్లేను దర్శకుడు బలంగా రాసుకోకపోవడమే. ఇక సెకండాఫ్‌లో కథ మరింత నెమ్మదించింది.
గోల్డ్ ఫీల్డ్ తవ్వకాలు, వాటిని పర్యవసానాల సన్నివేశాలను మరింత బిగువుగా లేకపోవడం వల్ల ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తిగ అనిపించదు. సినిమాలో వున్న అత సహజత్వం వల్ల అప్పుడప్పుడు డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక పతాక సన్నివేశాలు కూడా హడావుడిగా ముగించడమే ఈ చిత్రానికి మరో పెద్ద మైనస్. దర్శకుడు కీలక సన్నివేశాలను మరింత రక్తికట్టించనట్లయితే తప్పకుండా తంగలాన్ అందరి సినిమాగా వుండేది
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

