ముంబై : విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు, 2008లో అతడి సారథ్యంలోనే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్లో కొత్త అవతారమెత్తనున్నాడు.ఈసీజన్లో తన్మయ్ అంపైర్‌గా సేవలందించనున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో మెరిసినా జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోయిన తన్మయ్.. ఐపీఎల్లో తొలి రెండు సీజన్ల పాటు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీలో యూపీకి ఆడిన అతడు.. 2020లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో ఆడి ఇదే లీగ్‌లో అంపైర్‌గా పనిచేయబోతున్న తొలి వ్యక్తిగా తన్మయ్ రికార్డులకెక్కనున్నాడు.