Virat Kohli | భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫ్యామిలీతో తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. తన భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్‌తో కలిసి ప్రస్తుతం కోహ్లీ లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ విజేతగా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ ప్రస్తుతం తండ్రి బాధ్యతల్లో తలమునకలై ఉన్నాడు. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కోహ్లీ లండన్ వీధుల్లో (London streets) చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Virat Kohli on the London streets. 🐐pic.twitter.com/0WvBi9byXZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024
కాగా, వరల్డ్ కప్ తర్వాత బ్రేక్ తీసుకున్న కోహ్లీ ఇటీవలే శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన ముగించుకొని కోహ్లీ సరాసరి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఇక వచ్చే నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. అప్పటి వరకూ కోహ్లీ లండన్‌లోనే ఉండనున్నట్లు తెలిసింది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ – అనుష్క జంట 2017 డిసెంబర్ 11న ఇటలీలో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో ఓ పాప వామిక జన్మించింది. ఈఏడాది ఫిబ్రవరిలో ఈ జంట రెండోసారి కూడా తల్లిదండ్రులయ్యారు. అనుష్క ఫిబ్రవరి 15వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరుష్క జంట సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. బాబుకు అకాయ్ (Akaay) అని నామకరణం కూడా చేశారు.
Also read..
PM Modi | ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డులను అధిగమించిన ప్రధాని మోదీ