Double Decker | గుజరాత్లో ఓ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి (Two Coaches Detach). అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన వడోదర సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ – ముంబై మధ్య నడుస్తున్న (12932) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌కు (Double Decker Express) చెందిన రెండు కోచ్‌లు రైలు నుంచి విడిపోయాయి. ఉదయం 8:50 గంటలకు వడోదర (Vadodara) డివిజన్లోని గోతంగం యార్డ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. కప్లర్ విరిగిన కారణంగా 7, 8 కోచ్‌లు విడిపోయాయి. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు నుంచి బయటకు వచ్చి రైల్వే లైన్ల వద్ద నిలబడ్డారు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఉదయం 11:37 గంటలకు పునరుద్ధరణ పనులు కూడా పూర్తైనట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. అదేవిధంగా మెయిన్‌లైన్‌లో ట్రాఫిక్‌ను కూడా క్లియర్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనతో అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్లే రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
@RailMinIndia @IndianRailMedia @RailMinIndia
Please look into this matter
Train No.12935(mmct double decker) which is running today from ahmedabad to mumbai central
Nearby Surat The coaches of the train fall apart accidentally in the running train
We are facing many issues here pic.twitter.com/Xw1Wd1Maib— Mohit goyal (@2001mohitgoyal) August 15, 2024
Also Read..
PM Modi | ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డులను అధిగమించిన ప్రధాని మోదీ
PM Modi | మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి : ప్రధాని మోదీ