Meenakshi Chowdhury | టాలీవుడ్లో తనదైన గుర్తింపుతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా, ప్రమోషన్స్‌లో భాగంగా మీనాక్షి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, పాత్రల ఎంపిక, అలాగే వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న రూమర్స్‌పై స్పష్టంగా స్పందించారు.
ఇటీవల ‘లక్కీ భాస్కర్’ చిత్రం తర్వాత తల్లి పాత్రలు చేయనని మీనాక్షి వ్యాఖ్యానించారంటూ ప్రచారం జరిగింది. ఈ విషయంపై ప్రశ్నించగా ఆమె స్పష్టంగా ఖండించారు.“అలాంటి కామెంట్స్ నేను ఎక్కడా చేయలేదు. రూమర్స్‌ను ఎలా సృష్టిస్తారో నాకు అసలు అర్థం కావడం లేదు. నేను చెప్పని మాటలను నా పేరుతో ప్రచారం చేయడం బాధగా ఉంది” అని ఆమె అన్నారు. తన పాత్రల ఎంపికపై కూడా మీనాక్షి క్లారిటీ ఇచ్చారు. “నేను ఎప్పుడూ కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. కథ బాగుంటే, పాత్రకు బలం ఉంటే – అది ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధమే. హీరోయిన్, సపోర్టింగ్, క్యారెక్టర్ రోల్స్ అన్న భేదం నాకు లేదు” అని తెలిపారు.
ఇటీవల మీనాక్షి పెళ్లి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరోతో ఆమె ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కథనాలు వచ్చాయి. దీనిపై మీనాక్షి కాస్త భావోద్వేగంగా స్పందించారు.నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఎన్నో వార్తలు చూశాను. నిజంగా ఈ రూమర్స్ విని అలసిపోయాను. వాటిలో ఎలాంటి నిజం లేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను” అని తేల్చిచెప్పారు. వ్యక్తిగత జీవితంపై వచ్చే గాసిప్పులను పక్కనపెట్టి, ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని మీనాక్షి వెల్లడించారు. ‘అనగనగా ఒక రాజు’ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్న ఆమె, ఈ సంక్రాంతి తన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.