Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) లండన్‌లో ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ విజేతగా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ తండ్రి బాధ్యతల్లో తలమునకలై ఉన్నాడు. తాజాగా కోహ్లీ లండన్ వీధుల్లో తన వారసుడైన అకాయ్ (Akay)తో కలిసి కెమెరా కంట పడ్డాడు.
అకాయ్‌ను ఎత్తుకొన్న విరాట్ అక్కడి చిరు వ్యాపారుల దగ్గర ఏదో కొంటుండగా.. అనుష్క శర్మ (Anushka Sharma) వాళ్లను గమనిస్తుంటుంది. కోహ్లీ ఫ్యాన్ క్లబ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టిట వైరల్ అవుతోంది.
Akaay Kohli in his Papa’s Lap. 🩷 pic.twitter.com/dvj7RG76s8
— Virat Kohli Fan Club (@Trend_VKohli) July 18, 2024
కరీబియన్ గడ్డపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో నిరాశపరిచిన కోహ్లీ కీలకమైన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై దంచేశాడు. టాపార్డర్ విఫలమైన దశలో అర్ధ సెంచరీతో చెలరేగి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. తన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో టీమిండియా ట్రోఫీ కలన నిజం చేసిన విరాట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

వరల్డ్ కప్ హీరోగా జరిగిన స్వదేశం వచ్చిన కోహ్లీ జట్టు సభ్యులతో కలిసి ముంబైలో విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నాడు. అనంతరం వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సన్మానం అనంతరం ఈ స్టార్ ఆటగాడు కుటుంబాన్ని కలిసేందుకు లండన్ ఫ్లైట్ ఎక్కేశాడు.
వరల్డ్ కప్ తర్వాత బ్రేక్ తీసుకున్న కోహ్లీ శ్రీలంక సిరీస్‌లో ఆడడంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎందుకంటే.. తొలుత బోర్డు సీనియర్లు రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు కోహ్లీలకు లంక సిరీస్‌కు విశ్రాంతినిస్తున్నట్టు వెల్లడించింది. అయితే.. కొత్త కోచ్ గౌతం గంభీర్ మాత్రం ఇంకెన్ని రోజులు బ్రేక్ తీసుకుంటారు? జట్టుతో కలవాల్సిందే? అని ఈ సీనియర్ త్రయాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో లంకతో ఆగస్టు 2న మొదలయ్యే వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడుతాడా? అనేది తెలియాల్సి ఉంది.