తిరుమల : తిరుమల (Tirumala) కు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో జె. శ్యామలరావు (TTD EO Shyama Rao ) వెల్లడించారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డి) అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఈవో, ఎఫ్ఎస్డీ డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్(Hotle Food) లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, కొన్ని కిరాణా సామగ్రితో సహా కూరగాయలు(Vegitables) కుళ్లి పోయినట్లు వారు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. యాత్రికుల ఫిర్యాదు మేరకు హోటల్‌ను తనిఖీలు చేశామని చెప్పారు.
హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహార ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో, భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. హోటల్లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొబైల్ ల్యాబ్ ప్రారంభం
అనంతరం ఎఫ్ఎస్డీ డైరెక్టర్‌తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్(Mobile Lab) , “ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్”ను ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ వాహనంలో ఉంటుందని వివరించారు. ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తుందన్నారు.
Tirumala | శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ